: హైదరాబాద్‌లో పోలీసుల బైక్ లాక్కుని పారిపోయిన చైన్ స్నాచర్లు
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పరిధిలో చైన్ స్నాచర్లు అలజడి సృష్టించారు. కానిస్టేబుల్‌పై దాడి చేసి, పోలీసుల బైక్‌ను లాక్కుని దానిపై తప్పించుకు పారిపోయారు. ఈ రోజు ఉదయం సరూర్‌నగర్ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడి, బైకుపై పారిపోతుండగా సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని వెంబడించారు. అయితే చైన్ స్నాచర్ల బైకులో పెట్రోలు అయిపోవడంతో ఒక్కసారిగా వారి బైకు ఆగిపోయింది. దీంతో చైన్ స్నాచర్లు పోలీసులకి చిక్కినట్లేనని స్థానికులు భావించారు. కానీ, దుండగులు వారివద్ద ఉన్న ఆయుధాలతో పోలీస్ కానిస్టేబుల్ని బెదిరించి పోలీసుల బైక్ లాగేసుకుని, ఆ బైక్‌పైనే ఉడాయించారు. చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు రెట్టింపు చేశారు.