: భారత ఆర్మీ చరిత్రలో మొట్టమొదటి 'స్వోర్డ్ ఆఫ్ ఆనర్' పొందిన మహిళగా దివ్య
దివ్యా అజిత్ కుమార్... భారత వాయుసేనలో అధికారిణి. మహిళలు పురుషులతో అన్ని రంగాల్లోను సమానమేనని, ఎందులోనూ తక్కువ కాదని నిరూపించింది. ఇండియన్ ఆర్మీ హిస్టరీలో 'స్వోర్డ్ ఆఫ్ ఆనర్' పొందిన తొలి మహిళగా దివ్య రికార్డు సృష్టించారు. ఉత్తమ మహిళా అధికారిగా ఆమె చూపిన చొరవకు ఈ గౌరవం దక్కగా, 2010లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఈమె, రాజ్ పథ్ లో తొలిసారిగా మహిళల కవాతు జరిగిన వేళ, 154 మందిని ముందుండి నడిపించారు. ప్రస్తుతం చెన్నై లో ట్రైనింగ్ అకాడమీలో శిక్షకురాలిగా ఉంటూ, ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచిన దివ్య, ఖాళీ సమయాల్లో స్కూళ్లు, కాలేజీలకూ వెళ్లి, విద్యార్థులను ఉత్తేజపరిచే ప్రసంగాలను, వారి కెరీర్ ను సాయుధ దళాల దిశగా మళ్లించే ప్రయత్నాలనూ చేస్తున్నారట. అన్నట్టు సంగీతమంటే ప్రాణమిచ్చే దివ్య, భరతనాట్యంలో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు.