: పాత స్మార్ట్ ఫోన్ కు రూ. 16 వేల వరకూ ఇస్తున్న వన్ ప్లస్!


చైనాలో టెక్ స్టార్టప్ గా మొదలై, అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తూ, భారత మార్కెట్లోకి దూసుకొచ్చిన వన్ ప్లస్ బైబ్యాక్ స్కీమ్, ఎక్స్ఛేంజ్ లను ప్రకటించింది. ఇందులో భాగంగా వన్ ప్లస్ వన్, వన్ ప్లస్ 2, వన్ ప్లస్ ఎక్స్ ఫోన్లను కొనుగోలు చేయాలని భావించే వారు, తమ పాత స్మార్ట్ ఫోన్లను మార్చుకొని రూ. 16 వేల వరకూ రాయితీలను పొందవచ్చని వెల్లడించింది. ఇందుకోసం అమేజాన్, రీగ్లోబ్ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని పేర్కొంది. ఈ మూడు ఫోన్లలో ఏదో ఒకదాన్ని అమేజాన్ వెబ్ సైట్ ద్వారా సెలక్ట్ చేసుకుని 'మొబైల్ బైబ్యాక్' పై క్లిక్ చేసి నిబంధనలు తెలుసుకుని 'ఐ ఎగ్రీ' బటన్ క్లిక్ చేయడం ద్వారా రీ గ్లోబ్ వెబ్ సైట్ కు వెళ్లవచ్చని, అక్కడ అమేజాన్ ఆర్డర్ ఐడీని, మీ స్మార్ట్ ఫోన్ వివరాలను ఎంటర్ చేస్తే, లభించే ఆఫర్ తెలుస్తుందని వన్ ప్లస్ తెలిపింది. ఆపై రీ గ్లోబ్ ఉద్యోగి ఇంటికి వచ్చి ఫోన్ తీసుకుని అక్కడికక్కడే డబ్బు చెల్లిస్తాడని వెల్లడించింది.

  • Loading...

More Telugu News