: అపోలోకు ఏపీ కేబినెట్ బంపరాఫర్!... చిత్తూరు ఆసుపత్రి లీజు 35 ఏళ్లకు పెంపు


ప్రైవేట్ వైద్య రంగ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ పై వరాల జల్లు కురుస్తోంది. దేశంలోనే తొలిసారిగా ఓ ప్రభుత్వ ఆసుపత్రిని చేజిక్కించుకున్న అపోలో హాస్పిటల్స్ రికార్డు పుటలకెక్కింది. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి సొంత జిల్లా చిత్తూరులోని జిల్లా కేంద్ర ఆసుపత్రిని ఐదేళ్ల పాటు ఆ ఆసుపత్రికి లీజుకు ఇస్తూ గతంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా ప్రభుత్వం వెనకడుగు వేయలేదు. తాజాగా నిన్న విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో చంద్రబాబు సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు ఆసుపత్రిని అపోలో హాస్పిటల్స్ కు లీజుకు ఇచ్చిన కాల పరిమితిని ఐదేళ్ల నుంచి 35 ఏళ్లకు పెంచేసింది. అంటే, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపుగా అపోలో హాస్పిటల్స్ చేతుల్లోకి వెళ్లినట్లేనన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News