: అమెరికాలో వర్ష బీభత్సం!... ఏడుగురు దుర్మరణం, భారీగా ఆస్తి నష్టం


అమెరికాను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా అమెరికాలోని పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. ఈ వరదల్లో చిక్కుకుని ఇప్పటిదాకా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. టెక్సాస్ సహా పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీని ప్రకటించిన అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. భారీ వర్షం, వరద నీటి కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం బెంబేలెత్తుతున్నారు. టెక్సాస్ సహా, హూస్టన్ లో పెద్ద సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. భారీ ఆస్తి నష్టం సంభవించింది. పాఠశాలలు మూతపడ్డాయి. నడిరోడ్డుపైకి వచ్చేసిన నీరు చూస్తుండగానే పెను బీభత్సం సృష్టించింది.

  • Loading...

More Telugu News