: వివాహేతర సంబంధం మోజులో ...అత్త, కుమార్తెల ఉసురు తీసిన మహిళకు జీవిత ఖైదు, ఆమె ప్రియుడికి మరణశిక్ష


వివాహేతర సంబంధంపై వ్యామోహంతో అత్త, కుమార్తెలను హత్య చేసి, భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు తిరువనంతపురం కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. ఆమె ప్రియుడికి మరణశిక్షను ఖరారు చేసింది. తిరువనంతపురంలోని టెక్నోపార్కులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్న అనుశాంతి, నినో మాథ్యుస్ కు ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యామోహం మత్తులో అనుశాంతిని కలిసేందుకు అడ్డుగా ఉన్న కుటుంబాన్ని హత్య చేయాలని నినో మాథ్యుస్ పథకం రచించాడు. అనుకున్నట్టే అనుశాంతి మూడేళ్ల కుమార్తె, నిస్సహాయురాలైన ఆమె అత్తలను నినో మాథ్యూస్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అనుశాంతి భర్తను కూడా హత్య చేయబోగా, తీవ్ర గాయాలపాలైన లిజేష్, నినో మాథ్యూస్ బారి నుంచి తప్పించుకుని పారిపోయాడు. అనంతరం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది 2014లో కేరళలో కలకలం రేపింది. దీంతో అనుశాంతి, ఆమె ప్రియుడు నినో మాథ్యూస్ ల కేసును విచారించిన న్యాయస్థానం నేడు తీర్పు చెప్పింది. నినో మాథ్యూస్ కు 50 లక్షల జరిమానాతో పాటు మరణశిక్ష విధించింది. అనుశాంతిని 'అమ్మతనానికే మచ్చతెచ్చావు' అని పేర్కొన్న న్యాయస్ధానం 50 లక్షల జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించింది. ఈ మొత్తంలో లిజేష్ కు 50 లక్షల రూపాయలు, ఆమె మామకు 30 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.

  • Loading...

More Telugu News