: వలకు చిక్కిన అరుదైన మెగా మౌత్ షార్క్!


జపాన్ కు చెందిన ఒక మత్స్యకారుడి వలలో అరుదైన మెగా మౌత్ షార్క్ పడింది. ఒవాస్ పోర్ట్ కు మూడు మైళ్ల దూరంలో ఉన్న ఎంఐఈ ప్రిఫెక్త్యూర్ లో నిన్న ఒక మత్స్యకారుడు వేసిన వలలో ఇది చిక్కింది. మెగా మౌత్ షార్క్ బరువు 907 కిలోలు కాగా, సుమారు 5 మీటర్ల పొడవు ఉంది. సమీపంలోని ఫిష్ మార్కెట్ కు దీనిని తరలించారు. కాగా, సముద్ర జలాల్లోని చిన్న చిన్న జంతువులను, మొక్కలను ఆహారంగా మెగా మౌత్ షార్క్ లు తీసుకుంటాయి. ఈ తరహా షార్క్ లలో మొత్తం మూడు రకాలు ఉండగా అందులో ఇది కూడా ఒకటి. వేల్ షార్క్స్, బాస్కింగ్ షార్క్స్ కూడా చిన్న జంతువులను, మొక్కలనే ఆహారంగా తీసుకుంటాయి. మెగా మౌత్ షార్క్ ల నోరు మెరుస్తూ ఉంటుంది. చిన్నచిన్న జంతువులను ఆకర్షించేందుకు ఈ మెరిసే అతిపెద్ద నోరు ఉపయోగపడుతుంది. కాగా, ఈ తరహా షార్క్ లు 2014 లో రెండు, 2015 లో ఒకటి మాత్రమే మత్స్యకారుల వలకు చిక్కాయి.

  • Loading...

More Telugu News