: ఫస్ట్ ర్యాంకర్ పీతల సుజాత... లాస్ట్ ర్యాంకర్ నారాయణ
ఏపీ మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ర్యాంకులు కేటాయించారు. పార్టీ పరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, శాఖాపరమైన సమీక్షలు, కమిటీల ఏర్పాటు, జిల్లా టూర్లు, చేసిన పనులు ఆధారంగా మంత్రులకు ర్యాంకుల కేటాయింపు జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి పీతల సుజాత -1, దేవినేని ఉమామహేశ్వరరావు - 2, ప్రత్తిపాటి పుల్లారావు -3 ర్యాంకులు సాధించగా, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణకు చివరి ర్యాంకు లభించినట్లు సమాచారం.