: అప్పారావును వీసీ పదవి నుంచి తొలగించాలి: వీహెచ్
రోహిత్ వేముల ఆత్మహత్యకు హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావే కారణమని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఆరోపించారు. హైకోర్టులో ఈ ఘటనపై విచారణ అనంతరం హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు వ్యతిరేకిస్తున్నా వీసీగా అప్పారావును కొనసాగించడం సరికాదని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీని కేసీఆర్ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. వీసీ అప్పారావును మార్చేలా కేంద్రంతో మాట్లాడాలని ఆయన సూచించారు. వివాదాలకు నెలవైన వీసీ అప్పారావును విధుల నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.