: పాక్ జైల్లో భారత ఖైదీ సరబ్ జిత్ పై దాడి.. పరిస్థితి విషమం


గూఢచర్యం నేరంపై పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న భారతీయుడు సరబ్ జిత్ సింగ్ పై నేడు తోటి ఖైదీ దాడి చేశాడు. సరబ్ జిత్ గత 20 ఏళ్ళుగా లాహోర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. సరబ్ జిత్ ను నేడు ఓ గదిలోంచి మరో గదిలోకి తరలిస్తుండగా సహచర ఖైదీ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సరబ్ జిత్ తలకు బలమైన గాయం కావడంతో తొలుత జైల్లోనే చికిత్స అందించినా, పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News