: ఈక్వెడార్ భూకంపం పెద్దదే... ఇప్పటివరకూ 40 మందికి పైగా మృతి
ఈక్వెడార్ లో ఈ ఉదయం సంభవించిన భూకంపం తరువాతి వార్తలు ఒక్కొక్కటే వస్తున్నాయి. ప్రకంపనల కారణంగా వందలాది ఇళ్లు నేలమట్టం కాగా, రహదారులు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల రోడ్లపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. భవనాలు కూలిన ఘటనల్లో ఇప్పటివరకూ 40 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉండటంతో మరణించిన వారి సంఖ్య మరింతగా పెరగవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని క్వీటో నగరానికి 173 కిలోమీటర్ల దూరంలో 7.8 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసినప్పటికీ, ఇప్పటివరకూ రాకాసి అలలు వచ్చి పడినట్టు సమాచారం లేదు.