: సీఎం కేసీఆర్ కు జ్వరం... మూడు రోజుల విశ్రాంతి!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్వరమొచ్చింది. మూడు రోజుల పాటు పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. వ్యవసాయం క్షేత్రంలో సీఎం విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. వైద్యుల సూచనల మేరకు మూడు రోజుల పాటు సీఎం కార్యక్రమాలు రద్దయ్యాయని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) ఒక ప్రకటనలో పేర్కొంది.