: పాకిస్తాన్ లోని పంజాబ్ లో కొత్త చట్టం అమలైతే కనుక పెళ్లి విందులో ఒకే కూర వడ్డించాల్సిందే...!
పెళ్లి విందులో ఒకే ఒక కూర వడ్డించాలి, కట్నకానుకలు తీసుకోకూడదు, టపాసులు పేల్చకూడదు.. ఈ నిబంధనలన్నీ పాటిస్తేనే పంజాబ్ రాష్ట్రంలో పెళ్లి చేసుకోగల్గుతాం. పంజాబ్ అంటే.. మన దేశంలోని రాష్ట్రం కాదు, మన దాయాది దేశమైన పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం. అక్కడే ఒక కొత్త చట్టం అమల్లోకి రానుంది. దీనిని ఉల్లంఘిస్తే ఒక నెల జైలు శిక్షతో పాటు రూ.20 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇంతకీ, ఈ చట్టాన్ని ఎందుకు తీసుకువచ్చారంటే.. వివాహ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో అనవసరమైన ఖర్చును తగ్గించడానికట. ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని పంజాబ్ సీఎం షాబాజ్ షరీఫ్ పేర్కొన్నారు.