: నన్ను ఎవరైనా బెదిరించాలని చూస్తే గర్జిస్తా: మమతా బెనర్జీ
పోలీసు అధికారులను బదిలీ చేయడం వల్ల తమ విజయావకాశాలను దెబ్బతీయలేరంటూ ఎలక్షన్ కమిషన్ పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి మండిపడ్డారు. రానాఘాట్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ, బదిలీకి గురవుతున్న పోలీసు అధికారులందరూ తమ మనుషులేనని అన్నారు. ఇదంతా చూస్తుంటే, ప్రభుత్వ వ్యతిరేక సిండకేట్ ల ఫిర్యాదులపై ఈసీ చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. ‘నన్ను ఎవరైనా బెదిరించాలని చూస్తే గర్జిస్తాను. నేను ఇలాగే ఉంటాను.. ఇదే విధంగా మాట్లాడతాను. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్షాలకు విచారమే మిగులుతుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో మా పార్టీ క్రియాశీలక పాత్ర పోషించనుంది’ అని మమతా బెనర్జీ అన్నారు.