: ఐదేళ్ల నిరీక్షణతో ఆగ్రహం.. ఏపీపీఎస్సీ భవన్ ను ముట్టడించిన 2011 గ్రూప్-1 ఇంటర్వ్యూ అభ్యర్థులు
ఐదేళ్ల నిరీక్షణ 2011 గ్రూప్-1 ఇంటర్వ్యూ అభ్యర్థుల్లో ఆగ్రహం తెప్పించింది. హైదరాబాదు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో అభ్యర్థులు ఏపీపీఎస్సీ భవన్‌ను ముట్టడించారు. ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టు ముందు ప్రభుత్వం వాదనలు వినిపించాలని డిమాండ్ చేస్తున్నారు. 2011 గ్రూప్-1 ఇంటర్వ్యూ అభ్యర్థులు ఐదేళ్లుగా ఫలితాల కోసం నిరీక్షిస్తోన్న విషయం తెలిసిందే.