: భానుడి ప్రతాపానికి తెలుగు రాష్ట్రాల్లో నేడు 11 మంది మృతి
ఎండలు తీవ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఇప్పటివరకు వడదెబ్బ తగిలి 11 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మే నెల ప్రారంభం కాకముందే భానుడి ప్రతాపం అధికంగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు వడదెబ్బతో మరణించిన వారి సంఖ్య ఈ విధంగా ఉంది. కరీంనగర్ 3, ఆదిలాబాద్ 1, అనంతపురం 3, ప్రకాశం 1, కర్నూలు 1, శ్రీకాకుళం 1, పశ్చిమ గోదావరి 1. వడదెబ్బతో నిన్న ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల్లో 50 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.