: మాకు ఓటేయకపోతే మాలో మీరు చూసేది అసహనమే: బహిరంగ సభలో ప్రజలకు టీఎంసీ నేత హెచ్చరిక
'మాకు ఓటేయకపోతే మాలో మీరు చూసేది అసహనమే' అంటూ పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత అబ్దుల్ మన్నన్ ప్రజలను హెచ్చరించారు. ఆ పార్టీ నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడి బిర్భమ్ ప్రాంత ప్రజలనుద్దేశించి అబ్దుల్ మన్నన్ మాట్లాడుతూ... సంవత్సరం పొడవునా ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలూ కల్పిస్తామనీ, అయితే తమకు ఓటు వేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని వ్యాఖ్యానించారు. తమకు ఓటు వేస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, తాము ఆశించినంతగా మెజారిటీ ఇవ్వాలని, లేదంటే తమలో అసహనం చూస్తారని హెచ్చరించారు. 383 మంది అభ్యర్థులు బరిలోకి దిగిన పశ్చిమ బెంగాల్ లోని 56 శాసనసభ స్థానాలకు రేపు రెండో విడత పోలింగ్ జరగనుంది.