: దుమ్ము రేపుతున్న షారూఖ్ 'ఫ్యాన్'.. మొదటిరోజే రూ. 19.20 కోట్ల వసూలు


షారూఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ 'ఫ్యాన్'. ఇటీవల వరస ఫ్లాప్ లతో నిరాశలో వున్న షారూఖ్‌కు 'ఫ్యాన్' విడుదలైన మొదటిరోజే రూ. 19.20 కోట్లు వసూలు చేసి సంతోషాన్ని తెచ్చిపెట్టింది. షారూఖ్, స్టార్ హీరోగా, అతనికి వీరాభిమానిగా రెండు విభిన్న పాత్రల్లో ఈ సినిమాను రూపొందించారు. మనీష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. షారుఖ్ ఖాన్ 25 ఏళ్ల కుర్రాడిలా ప్రొస్థటిక్ మేకప్ తో నటించిన 'గౌరవ్' క్యారెక్టర్ హైలైట్‌గా ఉంద‌ని, నేడు, రేపు మ‌రిన్ని క‌లెక్ష‌న్లు రాబ‌డుతుంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

  • Loading...

More Telugu News