: ప్రైవేట్ రిజర్వేషన్ల కోసం వీహెచ్ దీక్ష!... సంఘీభావం ప్రకటించిన జానా, ఉత్తమ్
ప్రభుత్వ రంగంలో మాదిరే ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీ కాంగ్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ఒక్కరోజు దీక్షకు దిగారు. హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద నేటి ఉదయం ప్రారంభమైన ఈ దీక్షలో కూర్చున్న వీహెచ్ కు టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు టీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి తదితరులు సంఘీభావం ప్రకటించారు. వీహెచ్ దీక్ష, కాంగ్రెస్ అగ్రనేతల సంఘీభావంతో ఇందిరా పార్కు పరిసరాలు కిటకిటలాడాయి. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి... రిజర్వేషన్ల చట్టాన్ని బీజేపీ సర్కారు సవరిస్తే తమ పార్టీ మద్దతిస్తుందని ఆయన ప్రకటించారు.