: విమానం ఇంజిన్ రూంలో కూర్చున్నట్టుంది: ఎండలపై క్రికెట్ కామెంటేటర్ వ్యాఖ్య
దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను దాటుతుండగా, ఉత్తర భారతంలో 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిన్న రాజ్ కోట్ లో 32 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఇది చాలా ఎక్కువ ఉష్ణోగ్రతని ఐపీఎల్ మ్యాచ్ టీవీ కామెంటేటర్ తెలిపాడు. ఈ ఉష్ణోగ్రతలు ఎంతలా ఉన్నాయంటే విమానంలో ఇంజిన్ వెనుక నమోదైన ఉష్ణోగ్రతల్లా ఉన్నాయని పేర్కొన్నాడు. ఇంత వేడిలో ఆడడం సవాల్ తో కూడుకున్నదని అభిప్రాయపడ్డాడు. ఈ ఉష్ణోగ్రతలను చూస్తుంటే భయమేస్తోందని పేర్కొన్నాడు. దీంతో అతని పక్కనే ఉన్న భారత మహిళా జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా అందుకుని... కొన్ని రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పింది. 40 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయని అనడంతో, అయితే అక్కడ విమానం ఇంజిన్ లో ఉన్నట్టేనని అభిప్రాయపడ్డాడు.