: ఆ గ్రామాలు మనవే, చంద్రబాబు ఓకే చెప్పారు: కేసీఆర్


పోలవరం ముంపు ప్రాంతంలో భాగంగా ఉన్న ఐదు గ్రామాలు తెలంగాణ పరిధిలోకి రానున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. నేడు భద్రాచలం శ్రీరామ కల్యాణానికి వచ్చిన ఆయన, ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానని, గ్రామాలను తిరిగి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని స్పష్టం చేశారు. కాగా, రాష్ట్ర విభజన వేళ, భద్రాచలానికి సమీపంలో ఉండి, పోలవరం ముంపులో కలిసిపోనున్న గ్రామాలను ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పాలన పడకేయగా, గురువారం నాడు చంద్రబాబు పర్యటించి, అక్కడి ప్రజల్లో భయాలను తొలగించే పని చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మరోసారి ముంపు గ్రామాలు తెలంగాణకు రానున్నాయని వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News