: నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ పర్యటనలను ఆక్షేపించిన కేరళ పొలీస్ బాస్
పుట్టింగల్ దేవి ఆలయంలో అగ్నిప్రమాదం జరిగిన రోజునే ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రావడం తమ సహాయక చర్యలకు ఆటంకంగా మారిందని, వారిద్దరూ ఆ సమయంలో పర్యటనకు రాకపోయి ఉంటే బాగుండేదని కేరళ పోలీస్ చీఫ్ టీపీ సేన్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రధానితో పాటు పలువురు భద్రతా సిబ్బంది, అధికారులు కలియదిరగడంతో తాము మరిన్ని ఆధారాలు సేకరించలేక పోయామని ఆయన అన్నారు. ఆపై కాసేపటికే రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేత ఏకే ఆంటోనీ, రాష్ట్ర హోం మంత్రి రమేష్ చెన్నితల పర్యటించారని ఆయన గుర్తు చేశారు. సేన్ కుమార్ ఈ మాటలన్న కాసేపటికే కేరళ ముఖ్యమంత్రి ఊమన్ చాందీ స్పందించారు. ప్రధాని రాకతో తమకెంతో ఉపశమనం లభించిందని తెలిపారు.