: చంద్రబాబుకు ఫస్ట్ క్లాస్ మార్కులు!... పాస్ మార్కులకు ఆమడ దూరంలో అమాత్యులు!
దాదాపు పదేళ్ల తర్వాత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మళ్లీ ఏపీ సీఎం పగ్గాలు చేపట్టి రెండేళ్లవుతోంది. ఈ క్రమంలో ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్)’... చంద్రబాబు, ఆయన మంత్రివర్గం పనితీరుపై సమగ్ర సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో చంద్రబాబు పాసయ్యారు. ఏకంగా 67 మార్కులు కొట్టేసిన చంద్రబాబు... ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని ఈ సర్వేలో పాలుపంచుకున్న రాష్ట్ర ప్రజలు చెప్పారు. చంద్రబాబు పనితీరు బాగానే ఉన్నా, ఆయనకు మంత్రివర్గ సభ్యుల నుంచి ఆశించిన మేర సహకారం మాత్రం అందడం లేదని సర్వేలో తేలిపోయింది. ఈ విషయంలో కేబినెట్ లోని ఏ ఒక్క మంత్రి కూడా చంద్రబాబు ఆశించిన మేర పనిచేయలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో చంద్రబాబు ఫస్ల్ క్లాస్ లో పాసైనా, ఆయన కేబినెట్ సహచరుల్లో ఏ ఒక్కరు కూడా పాస్ మార్కులు దక్కించుకోలేకపోయారు.