: ఒంటిమిట్టలో వైభవంగా సీతారాముల కల్యాణం!... పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి గంటా
కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలను ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ధ్వజారోహణం జరగనుంది. ఈ క్రమంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మంత్రి గంటాతో పాటు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి కూడా ఒంటిమిట్ట వెళ్లనున్నారు.