: బన్నీలా సాయిధరమ్ తేజ్...నగ్మాలా రాశీఖన్నా: రవికిషన్


మెగా ఫ్యామిలీలో బన్నీ తనకు చాలా ఇష్టమని ప్రముఖ నటుడు రవికిషన్ చెప్పాడు. 'సుప్రీం' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తాను మద్దాలి శివారెడ్డిగా నటించిన 'రేసుగుర్రం' సందర్భంగా బన్నీతో మంచి అనుబంధం ఏర్పడిందని అన్నాడు. ఆ తరువాత అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయిథరమ్ తేజ్ లో అణకువ చూస్తే ఎంతో ముచ్చటేస్తుందని చెప్పాడు. ఈ సినిమా తరువాత బన్నీలా సాయి ధరమ్ తేజ్ తనకు మంచి తమ్ముడిలా మారాడని చెప్పాడు. రాశీ ఖన్నాను చూస్తే నగ్మా గుర్తుకొస్తుందని చెప్పాడు. తాను భోజ్ పురి భాషలో నగ్మాతో పని చేశానని అన్నాడు. ఆమెలా అంకితభావంతో రాశీ ఖన్నా పని చేస్తుందని, ఆమెకు మంచి భవిష్యత్ ఉందని రవికిషన్ తెలిపాడు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆయన ఆకాంక్షించాడు.

  • Loading...

More Telugu News