: చిరంజీవి మరోహిట్ సాంగ్ తో ఆకట్టుకున్న సాయిధరమ్ తేజ్


ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవిని, చిరంజీవి పాటలను అతని మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వినియోగించుకున్నంత గొప్పగా ఇంకెవరూ వినియోగించుకోలేదేమో...తొలి సినిమాలు 'రేయ్', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాల్లో చిరంజీవి, పవన్ కల్యాణ్ లను అచ్చంగా అనుకరించిన సాయిధరమ్ తేజ్ ఇలా చేస్తే ఎక్కువ కాలం సినీ పరిశ్రమలో రాణించడం కష్టమనే విమర్శలు ఎదుర్కొన్నాడు. అదే సమయంలో పాటల్లో చిరంజీవిలా చక్కని ఈజ్ కనబరిచాడని వారితోనే ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాల్లో తన మేనమామ చిరంజీవి సినిమాల హిట్ సాంగ్స్ ను పెట్టి వాటికి సరికొత్త స్టెప్పులేసి శభాష్ అనిపించుకున్నాడు. 'సుబ్రమణ్యం ఫర్ సేల్' సినిమాలో చిరు పాట 'గువ్వ గోరింకతో' అంటూ ఆకట్టుకున్నాడు. 'సుప్రీం' సినిమాలో చిరంజీవి 'యముడికి మెగుడు' సినిమాలో 'అందం హిందోళం' పాటను జొప్పించి ఆకట్టుకున్నాడు. నేటి ఆడియో వేడుకలో ఈ పాట ప్రారంభం కాగానే మెగా అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.

  • Loading...

More Telugu News