: నటి మీనా కూతురు నైనిక సెల్ఫీ క్వీన్: అమీ జాక్సన్
ప్రముఖ దక్షిణాది నటి మీనా కూతురు నైనిక చాలా అందంగా ఉంటుందని, నేచురల్ సెల్ఫీ క్వీన్ అని బ్రిటిష్ మోడల్, నటి అమీ జాక్సన్ తెగ మురిసిపోయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘తెరి’లో సమంత, అమీ జాక్సన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలోనే నైనిక బాలనటిగా పరిచయమైంది. ఈ చిత్రానికి సంబంధించి నిర్వహించిన ఒక ప్రెస్ మీట్ లో అమీ జాక్సన్, నైనిక దిగిన ఒక సెల్ఫీ ని ఆమె పోస్ట్ చేశారు. కాగా, ‘తెరి’ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ చిత్రం విడుదల సందర్భంగా హీరో విజయ్ అభిమానులు ఆయన కటౌట్లకు కూల్ డ్రింక్స్ తో అభిషేకం చేశారు.