: సీటు నచ్చలేదని ట్రైన్ ను ఆపేసిన శివసేన ఎమ్మెల్యే
అధికార గర్వం తలకెక్కిన శివసేన ఎమ్మెల్యే తీరుతో ఓ ట్రైన్ గంటపాటు ఆలస్యంగా నడిస్తే, మరో రెండు రైళ్లు కూడా ఆలస్యంగా నడిచిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. గత రాత్రి దేవగిరి ఎక్స్ ప్రెస్ 2000 మంది ప్రయాణికులతో ముంబై చేరుకుంది. నాందేడ్ కు చెందిన శివసేన ఎమ్మెల్యే హేమంత్ పాటిల్ నాందేడ్ వెళ్లేందుకు ట్రైన్ ఎక్కారు. ఆయనకు 2 టైర్ ఏసీ కోచ్ లో 35, 36 సీట్లను కేటాయించారు. అవి సైడ్ బెర్తులు కావడంతో ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు. దీంతో ఆయన అనుచరులు చైన్ లాగి ట్రైన్ ను ఆపేశారు. అధికారులు వచ్చి బుజ్జగించి, ఆయనకు వేరే సీట్లు కేటాయించే వరకు ట్రైన్ ను ఆయన కదలనీయకుండా హల్ చల్ చేశారు. ఆఖరికి ఆయన సీట్లో కూర్చున్న అనంతరం ట్రైన్ బయల్దేరింది. ఇలా ఆయన 55 నిమిషాలపాటు ట్రైన్ ను నిలిపేయడం విశేషం. దీనిపై రైల్వే జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ మాత్రం ప్రయాణికులను బాధ్యులను చేశారు. ఎవరో ట్రైన్ లాగడం వల్లే ట్రైన్ గంటసేపు ఆగిందని పేర్కొన్నారు. దీని వల్ల మంగుళూరు, సిద్ధేశ్వర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడిచాయి.