: చర్చించేదేమీ లేదంటూ మొహం చాటేసిన సుజయకృష్ణ రంగారావు!
బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని తెలుస్తున్న వేళ, ఆయన్ను బుజ్జగించేందుకు ఆఖరి ప్రయత్నంగా వైకాపా అధినేత జగన్ పార్టీ నేతలను పంపగా, వారిని కలిసేందుకు ఇష్టపడని సుజయకృష్ణ మోహం చాటేశారు. ఈ మధ్యాహ్నం వైకాపా నేతలు విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, కొలగట్ల తదితరులు రంగారావు ఇంటికి వెళ్లగా, ఆయన సహా కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేరు. వీరు వస్తున్నారని తెలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే, ఇక చర్చించేదేముందంటూ, మరో ప్రాంతానికి వెళ్లిపోయినట్టు సమాచారం. దీంతో కనీసం ఫోన్లో మాట్లాడదామని విజయసాయిరెడ్డి బృందం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.