: బాబా సాహెబ్ ఆశయాలను అమలు చేసింది ఎన్టీఆరే!... అమరావతిలో భారీ అంబేద్కర్ విగ్రహానికి చంద్రబాబు శంకుస్థాపన
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను దేశంలో తొలుత అమలు చేసింది దివంగత సీఎం నందమూరి తారకరామారావేనని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని కొద్దిసేపటి క్రితం నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించి ఎన్టీఆర్ పేదల కడుపు నింపారన్నారు. రూ.2లకే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి దేశంలో ఆహార భద్రతను తొలిసారి అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. పేదలకు గూడు కోసం అంబేద్కర్ సూచించిన పేదలకు పక్కా ఇళ్లను కూడా తొలుత అమలు చేసింది ఎన్టీఆరేనని చంద్రబాబు గుర్తు చేశారు.