: తెలంగాణలో ప్రారంభమైన మైక్రోమ్యాక్స్ మొబైల్ తయారీ ప్లాంటు


రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మైక్రోమ్యాక్స్ నెలకొల్పిన సెల్ ఫోన్ తయారీ కేంద్రాన్ని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్, మునిసిపల్ శాఖా మంత్రి కె.తారకరామారావు ఈ ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీ కంపెనీల భవిష్యత్ ప్రణాళికలకు భాగ్యనగరం కేంద్రంగా మారనుందని తెలిపారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని వచ్చే సంస్థలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. కేవలం ఆరు నెలల స్వల్ప వ్యవధిలో ఉత్పత్తిని ప్రారంభించిన సంస్థకు అభినందనలు తెలిపారు. సంస్థ సహ వ్యవస్థాపకుడు రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ, ఇండియాలో నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ సంస్థగా, ఆపై వరల్డ్ టాప్-5లోకి ఎదగాలన్న లక్ష్యంతో విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేసినట్టు వివరించారు. తాజాగా, 15 కొత్త స్మార్ట్ ఫోన్లు, రెండు ఎల్ఈడీ టీవీలు సహా 20 కొత్త ప్రొడక్టులను మార్కెట్ లోకి విడుదల చేశామని, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త లోగోను ఆవిష్కరించామని తెలిపారు. ఈ ప్లాంటును రూ. 80 కోట్లతో ఏర్పాటు చేశామని, దీని నుంచి 3500 మందికి ఉపాధి లభించనుందని తెలిపారు.

  • Loading...

More Telugu News