: మట్టి తవ్వకాల్లో ఉప్పొంగిన గంగమ్మ!... కర్నూలు జిల్లాలో వింత!


అసలే ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో జనం చనిపోతున్నారు. ఈ క్రమంలో చుక్క నీరు కూడా దొరకని ప్రాంతాల సంఖ్య అమాంతం పెరుగుతోంది. నీరు లేక నేల నెర్రలు బారుతోంది. అడుగుల మేర భూమిని తవ్వినా నీటి జాడే కనిపించడం లేదు. ఈ విపత్కర పరిస్థితికి భిన్నంగా నిన్న కర్నూలు జిల్లాలో ఓ అరుదైన ఘటన వెలుగుచూసింది. మట్టి కోసం తవ్వకాలు జరిపిన ప్రాంతంలో గంగమ్మ తల్లి ఉప్పొంగింది. జిల్లాలోని ఆలూరు మండలం హత్తిబెళగల్ గ్రామానికి చెందిన రైతులు చిదానందగౌడ్, బసవరాజుగౌడ్... తమ పొలాల్లో రహదారి నిర్మాణం కోసం 12 అడుగుల మేర మట్టిని తవ్వారు. ఇటీవలే జరిగిన ఈ తవ్వకాలకు ముందు అక్కడ చుక్క నీరు కూడా లేదు. అయితే 15 రోజుల క్రితం ఆ గుంతల్లో తేమ రావడం మొదలైంది. చుక్క చుక్కగా బయటకు వస్తున్న నీరు... ప్రస్తుతం ఐదడుగుల స్థాయికి చేరింది. మండుటెండల్లో ఇంత మేర నీటి ప్రవాహం భూమిలో నుంచి ఉబికిరావడం ఆ రైతులనే కాకుండా అక్కడి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

  • Loading...

More Telugu News