: పవన్ కల్యాణ్ కు కాంగ్రెస్ ఆఫర్...ప్రజా సమస్యలపై పోరాటానికి మద్దతు!: ఏపీ పీసీసీ
ప్రజా సమస్యలపై పోరాడేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ను దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చిన పవన్ కల్యాణ్ కు కాంగ్రెస్ మద్దతు పలకడంపై ఆసక్తి కలుగుతోంది. పవన్ కల్యాణ్ క్రియాశీలక రాజకీయాల్లోకి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోందని ఏపీ పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం తెలిపారు. పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం వాటిపై పోరాటం చేయాలని ఆయన తెలిపారు.