: ఆరోజు భారీ షాట్‌కు ప్రయత్నించకుండా సింగిల్ చేస్తే బాగుండేది: బంగ్లా బ్యాట్స్మన్
ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్ పోరులో టీమిండియా చేతిలో ఒక్కపరుగు తేడాతో ఓటమిపాలైన బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆ చేదు అనుభవాన్ని మరచిపోలేకపోతున్నారు. 'టీమిండియాతో ఓడిన ఆ రోజు రాత్రి మా ఆటగాళ్లం భోజనం చేయడం కూడా మానేశాం' అని బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ మష్రఫె ముర్తజా నిన్న పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా బంగ్లా బ్యాట్స్ మన్ మహ్మదుల్లా తమ జట్టు ఆరోజు ఓటమి పాలవ్వడం పట్ల నిరాశను మరోసారి వ్యక్తం చేశాడు. ఓడిపోతామని తాము ఊహించలేదని పేర్కొన్నాడు. ఆ ఓటమిని మర్చిపోలేమని అన్నాడు. 'ఆ రోజు క్రీజులో భారీ షాట్ కు ప్రయత్నించి తప్పు చేశా'నని అభిప్రాయపడ్డాడు. భారీ షాట్‌కు ప్రయత్నించకుండా సింగిల్ చేస్తే బాగుండేదని అన్నాడు. అంతేకాదు ఆ ఓటమికి బాధ్యత తనదేనని పేర్కొన్నాడు.