: 'ఎన్నాళ్లో వేచిన ఉదయం' అని పాడుకుంటున్న ఖాన్ ద్వయం అభిమానులు
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ త్రయానికి విశేషమైన అభిమానులున్నారు. షారూఖ్ రొమాంటిక్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకోగా, సల్మాన్ మాస్ హీరో ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అమీర్ వీరిద్దరికీ భిన్నమైన మిస్టర్ పర్ ఫెక్ట్ గుర్తింపు పొందాడు. వీరిలో అమీర్ ఇద్దరితోనూ స్నేహంగా ఉంటాడు. కెరీర్ తొలినాళ్లలో ప్రాణస్నేహితుల్లా మెలిగిన షారూఖ్, సల్మాన్ కాలక్రమంలో శత్రువులుగా మారారు. పలు సందర్భాల్లో ఘర్షణకు దిగారు. దీంతో బాలీవుడ్ కూడా షారూఖ్, సల్మాన్ మద్దతుదారులుగా విడిపోయారు. దీంతో రెండు వర్గాలు ఒకరికి ఒకరు దూరంగా ఉండేవారు. దీంతో వీరెప్పుడు కలుస్తారా? అని అభిమానులు వేయికళ్లతో చూసేవారు. 'భజరంగీ భాయ్ జాన్' విడుదల సందర్భంగా పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన షారూఖ్ వివాదానికి ముగింపు పలికాడు. దీంతో షారూఖ్ 'దిల్ వాలే'ను సల్మాన్ 'బిగ్ బాస్'ద్వారా ప్రచారం చేశాడు. ఇప్పుడు సల్మాన్ 'సుల్తాన్' టీజర్ ను షారూఖ్ మరోసారి ఆకాశానికెత్తేశాడు. 'క్యాబాత్ హే... హర్యాణా కీ షేర్ ఆగయాహై' అంటూ 'సుల్తాన్' టీజర్ ను షారూఖ్ షేర్ చేశాడు. దీంతో తమ అభిమాన హీరోలు ఇంతలా కలిసిపోవడం పట్ల వారి అభిమానులు సంతోషంతో 'ఎన్నాళ్లో వేచిన ఉదయం' అని పాడుకుంటున్నారు.