: అంబేద్కర్ ఆశయాలను నిలువునా పాతేస్తున్న చంద్రబాబు: అంబటి రాంబాబు
భారత రాజ్యాంగ కర్త అంబేద్కర్ ఆశయాలను ఏపీ సీఎం చంద్రబాబు నిలువునా పాతేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ, ఆయన విగ్రహాలకు పూల దండలు వేయడం వలన ఉపయోగం లేదని, ఈ విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తుంచుకోవాలని అన్నారు. ఎస్సీలను అవమానించే విధంగా మాట్లాడిన చంద్రబాబు, ఆ కులస్తులకు ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాతే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.