: నల్లధనం గుట్టు తెలిసిన 'మొసాక్ ఫోన్సెకా'పై పోలీసుల దాడులు


పనామా కేంద్రంగా, వివిధ దేశాల బడాబాబులు తమ నల్లధనాన్ని దాచుకునేందుకు సహకరించిన మొసాక్ ఫోన్సెకా సంస్థపై పోలీసులు భారీ ఎత్తున దాడులు చేస్తున్నారు. ఈ సంస్థ వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన వారు 'పనామా పేపర్స్' పేరిట నల్లధనాన్ని దాచుకున్న వారి వివరాలను వెల్లడిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉదయం వ్యవస్థీకృత నేరాల విభాగం అధికారులను వెంటబెట్టుకు వెళ్లిన పోలీసులు సంస్థ పత్రాలన్నింటినీ స్వాధీనం చేసుకునేందుకే దాడి చేసినట్టు పనామా అటార్నీ జనరల్ కార్యాలయం వెల్లడించింది. దాడులకు వచ్చిన అధికారులకు సహకరిస్తున్నట్టు సంస్థ తన ట్విట్టర్ ఖాతాద్వారా తెలిపింది. అయితే, తమ సంస్థ పత్రాలు హ్యాక్ అయ్యాయని, తాము కూడా బాధితులమేనని మొసాక్ ఫోన్సెకా వాదిస్తోంది. తమ వద్ద లభించిన సమాచారాన్ని తప్పుడు మార్గాల్లో వాడుకుంటున్నారని సంస్థ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, విదేశీ సంస్థల విషయంలో పారదర్శకతను తీసుకువచ్చే దిశగా విదేశాలతో కలసి పని చేస్తామని పనామా అధ్యక్షుడు జువాన్ కార్లోస్ వారెలా తెలిపారు.

  • Loading...

More Telugu News