: జ్యోతుల నెహ్రూ స్థానంలో తూ.గో.జిల్లా అధ్యక్షుడిగా కన్నబాబుకు ఛాన్సిచ్చిన జగన్


తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మొన్నటి వరకూ కొనసాగిన జ్యోతుల నెహ్రూ, ఆ పార్టీని వీడటంతో మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబుకు జిల్లా బాధ్యతలను అప్పగించనున్నట్టు తెలుస్తోంది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన పేరు ఖరారైందని, అతి త్వరలో ఆయన పేరు అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వచ్చిన ప్రతినిధులు, వివిధ కమిటీల నేతలతో లోటస్ పాండ్ లో సమావేశమైన జగన్, తదుపరి అధ్యక్షుడి ఎంపికపై సమాలోచనలు చేశారు. ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడిన ఆయన, చివరకు కన్నబాబు పేరును ఖరారు చేశారని సమాచారం.

  • Loading...

More Telugu News