: సీఎం చంద్రబాబు పనితీరంటే నాకు ఇష్టం: అజయ్ దేవగణ్
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరంటే తనకు చాలా ఇష్టమని, అందుకే ఆయన్ని కలిసేందుకు వచ్చానని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ అన్నారు. ఏపీ టూరిజం విభాగానికి ప్రచారకర్తలుగా అజయ్ దేవగణ్, కాజోల్ దంపతులు నియమితులైన విషయం తెలిసిందే. అంతకుముందు, చంద్రబాబును అజయ్ దేవగణ్ కలిశాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గత 25 ఏళ్లుగా హైదరాబాద్ ను చూస్తున్నానని, చంద్రబాబు హయాంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. చంద్రబాబు నిబద్ధతను చూస్తుంటే, విజయవాడ సహా ఈ ప్రాంతమంతా కచ్చితంగా అభివృద్ది చెందుతుందని అజయ్ దేవగణ్ అన్నారు.