: విరార్ రైల్వేస్టేషన్ లో వ్యక్తి దారుణ హత్య


ముంబయిలోని విరార్ రైల్వే స్టేషన్లో ని ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఒక వ్యక్తిని మరో వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. దహిసార్ ప్రాంతానికి చెందిన మోహన్ పాల్ అనే వ్యక్తి అందరూ చూస్తుండగానే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సదరు వ్యక్తి చనిపోయే వరకు హంతకుడు అక్కడే నిలబడ్డాడు. ఈ సంఘటనంతా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. అయితే, ఈ కేసు తమ పరిధిలోకి రాదంటే, తమ పరిధిలోకి రాదంటూ రైల్వే పోలీసులు, విరార్ పోలీసులు కొంత సేపు వాగ్వివాదానికి దిగారు. ఎట్టకేలకు విరార్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు పాల్ ను అరెస్టు చేశారు. కాగా, మృతుడి వివరాలను పోలీసులు వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News