: భారత్-పాక్ గొడవలతో మాకు సంబంధం లేదు: కార్టర్


భారత్-పాక్ గొడవలతో తమకు సంబంధం లేదని అమెరికా డిఫెన్స్ సెక్రటరీ కార్టర్ తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగంగా తాము పాకిస్థాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. పాకిస్థాన్ లో తిష్టవేసుకుని ఉన్న తీవ్రవాదంపై తాము సీరియస్ గా ఉన్నామని, పాకిస్థాన్ నుంచి తీవ్రవాదాన్ని తరిమేయడంలో భాగంగా పరిస్పర సహకారం పద్ధతిలో తాము స్నేహం చేస్తున్నామని ఆయన తెలిపారు. పాకిస్థాన్ లో పుట్టిన ఉగ్రవాదానికి తాము కూడా బాధితులమేనని ఆయన చెప్పారు. ఆఫ్ఘన్ లో టెర్రరిజం కారణంగా తాము చాలా నష్టపోయామని ఆయన చెప్పారు. కాగా, ఉగ్రవాదాన్ని అరికట్టడం పేరుతో అమెరికా సరఫరా చేస్తున్న ఆయుధాలను పాకిస్థాన్ తమపై గురిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని చాలా కాలంగా భారత్ అంతర్జాతీయ సమాజానికి చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, పాక్ కు జెట్ ఫైటర్లను సరఫరా చేస్తామంటూ అమెరికా ప్రకటించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

  • Loading...

More Telugu News