: అన్ని నియోజకవర్గాల్లోను అగ్నిమాపక కేంద్రాల ఏర్పాటు, కేర‌ళ‌లాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూస్తాం: తెలంగాణ హోంశాఖ మంత్రి


వేస‌వి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అగ్నిప్ర‌మాదాలు సంభ‌వించ‌కుండా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌ని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోను ఈ ఏడాది అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వ‌హిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అగ్నిమాపక శాఖ అధికారుల ప‌నితీరును మెచ్చుకున్నారు. ఆన్‌లైన్‌ లోనే అగ్నిమాపక అనుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కేర‌ళ అగ్నిప్ర‌మాదం లాంటి ఘ‌ట‌న‌లు రాష్ట్రంలో జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News