: మూడు అంచెల్లో స్థానిక ఎన్నికలు
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గెజిట్ రిజర్వేషన్ వచ్చిన వారం రోజుల్లోపే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రమాకాంత్ రెడ్డి చెప్పారు. కాగా, ఎన్నికలను మూడు అంచెల్లో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. తొలి రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను, మూడో విడతలో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు. మొత్తమ్మీద 17 రోజుల్లో ఎన్నికల నిర్వహణ పూర్తి చేస్తామని తెలిపారు.