: ప్ర‌త్యూష మృతి ప‌ట్ల షారూఖ్ సంతాపం.. 'మంచిరోజులు, చెడ్డరోజులు రెండూ ఉంటాయి, నిరాశ‌వ‌ద్ద‌'ని వ్యాఖ్య‌


టీవీ నటి ప్రత్యూష బెనర్జీ మృతిపట్ల బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సంతాపం తెలిపారు. తాను డ్యూయ‌ల్ రోల్‌ చేసిన 'ఫ్యాన్' సినిమా ప్ర‌మోష‌న్ సంద‌ర్భంగా షారుక్ మీడియాతో మాట్లాడుతూ... జీవితంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నిరాశ‌కు లోను కావ‌ద్ద‌ని వ్యాఖ్యానించారు. స‌క్సెస్ సాధ‌న దిశ‌లో ఎటువంటి ఫ‌లితాలొచ్చినా బాధ‌ ప‌డొద్ద‌ని సూచించారు. జీవితంలో మంచి, చెడు రెండింటికీ ఆస్కారం ఉంటుంద‌ని పేర్కొన్నారు. 'మీరు చేసిన కృషి వ‌ల్లే నేడు మీరు ఈ స్థాయిలో ఉన్నారు, ఎదుర‌య్యే ఆటుపోట్ల గురించి బాధ‌ప‌డ‌కూడ‌ద‌'ని అన్నారు. చేతిలో ప‌నిలేన‌ప్పుడు నిరాశ చెంద‌కూడ‌ద‌ని, ప్ర‌తిభ ఉంటే ప‌ని ఎప్ప‌టికయినా ల‌భిస్తుంద‌ని వ్యాఖ్యానించారు. 'బాలికా వధు' హిందీ సీరియల్ లో ఆనంది పాత్రలో నటించి పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న నటి ప్రత్యూష బెనర్జీ కొన్ని రోజుల క్రితం ముంబైలో ఆత్మహత్య చేసుకున్న విష‌యం తెలిసిందే.

  • Loading...

More Telugu News