: కిలోమీటరుకు రూ. 5కే ఉబెర్ టాక్సీ...పోటీని తట్టుకునే ప్రయత్నం!
ఓలా నుంచి వస్తున్న పోటీని తట్టుకుని, మరింత మంది కస్టమర్లను ఆకర్షించేలా 10 మెట్రో నగరాల్లో కారు అద్దె ధరలను 22 శాతం వరకూ తగ్గిస్తున్నట్టు ఉబెర్ ప్రకటించింది. తగ్గించిన చార్జీల తరువాత విశాఖపట్నం, నాగపూర్, ఇండోర్, అహ్మదాబాద్ నగరాల్లో నలుగురు కేవలం రూ. 5తో కిలోమీటరు దూరం ప్రయాణించవచ్చని ఉబెర్ తన బ్లాగ్ పోస్టులో వెల్లడించింది. ఉదయ్ పూర్, జోధ్ పూర్ వంటి టూరిస్టు ప్రాంతాల్లో కనీస చార్జీని రూ. 40 నుంచి రూ. 25కు తగ్గించామని, ఇక్కడ కిలోమీటరుకు రూ. 8గా ఉన్న ధరను రూ.7కు తగ్గించామని ప్రకటించింది.