: 250 కిలోల బరువు, 8 మీటర్ల పొడవుతో పేరొందిన కొండచిలువ మృతి
మలేషియాలో 250 కిలోల బరువు, 8 మీటర్ల పొడవుతో పేరొందిన కొండచిలువ మృతి చెందింది. ప్రపంచంలోనే అతి పొడవైన కొండచిలువగా ఇది పేరుపొందింది. భారీ బరువున్న ఈ కొండచిలువను.. అది చనిపోయిన ప్రాంతం పెనాంగ్ దీవుల్లో నుంచి తరలించడానికి సిబ్బందికి అరగంట సమయం పట్టింది. గుడ్లు పెట్టిన తర్వాత అక్కడి ఓ చెట్టు కింద ఈ కొండచిలువ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.