: చంద్రబాబుకు వత్తాసెందుకు? నీ అన్న బాటలో నడవద్దు: పవన్ కు సీపీఐ రామకృష్ణ సలహా
2019 ఎన్నికల్లో బరిలోకి దిగుతానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించడంపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు. "మీ అన్న చిరంజీవి బాటలో మాత్రం నడవద్దు" అని సలహా ఇచ్చారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజల పక్షాన పోరాడతానని, ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ పత్తా లేకుండా పోయారని ఆరోపించారు. ప్రతి విషయంలోనూ చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారెందుకని ప్రశ్నించారు. రాజధాని భూములపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన ఆయన, ఆపై కనిపించలేదని ఆరోపించారు. కాపులు చేస్తున్న ఉద్యమంపై పవన్ చెప్పిన మాటలు ఎవరికీ అర్థం కాలేదని రామకృష్ణ అన్నారు.