: నా కొడుకు పాడిన రెండో పాట తెలుగులోనే: రెహమాన్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ధన్యవాదాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు. '24' ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు తొలి పాటను అరబిక్ లో పాడితే, రెండో పాటను తెలుగులోనే పాడాడని అన్నారు. తమిళంలో ఇంతవరకు పాడలేదని ఆయన గుర్తు చేశారు. వర్ధమాన నటుడు రోషన్ (శ్రీకాంత్ కొడుకు)కు తన కుమారుడు పాట పాడాడని ఆయన గుర్తు చేశారు. తన సంగీతాన్ని తెలుగు ప్రజలంతా ఆదరిస్తూ వచ్చారని, తనపై ఎప్పట్లాగే ప్రేమాభిమానాలు కురిపించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు ప్రజల మనసులు గొప్పవని ఆయన చెప్పారు. ఏ దేశంలో ఉన్నా తెలుగు వారి ఆదరణ వేరని ఆయన పేర్కొన్నారు.