: ఎలా ఉన్నారు? ట్రైలర్ నచ్చిందా?: తెలుగులో అడిగిన సూర్య


ఈ సారి తెలుగు నేర్చుకుంటాను...ఆడియో వేడుకలో ఎంతో కొంత తెలుగు మాట్లాడే ప్రయత్నం చేస్తానని గతంలో 'యముడు' ఆడియో విడుదల సందర్భంగా వైజాగ్ లో చెప్పిన మాటను సూర్య నిజం చేశాడు. '24' ఆడియో వేడుకలో 'ఎలా ఉన్నారు...'24' ట్రైటర్ నచ్చిందా?' అని తెలుగులో అడిగాడు. అలాగే వేదికపై ఉన్నవారిని తెలుగులో పలకరించే ప్రయత్నం చేశాడు. రంజాన్ ఉపవాసాల సమయంలో ఈ కథను విని, రెహమాన్ అంగీకరించారని సూర్య తెలిపాడు. తనకు మీ ప్రేమ, ఆశీస్సులు కావాలని అభిమానులను కోరాడు. తనకు ప్రేక్షకుల ఆదరణ కావాలని, ఇలాగే తనను దీవించాలని అన్నాడు. ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్, అజయ్ వంటి వారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ సినిమాకు పని చేసిన అందరికీ ధన్యవాదాలని సూర్య చెప్పాడు. కొరటాల శివ 'జనతా గ్యారెజ్' సినిమా కథ తనకు తెలుసని, సూపర్ హిట్ అవుతుందని సూర్య తెలిపాడు.

  • Loading...

More Telugu News