: ఆఫ్గాన్ లో ఆత్మాహుతి దాడి: 12 మంది ఆర్మీ జవాన్లు మృతి


ఆఫ్గనిస్తాన్ లోని జలాలాబాద్ శివారు ప్రాంతంలో కొత్తగా సెలక్టయిన ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును ఆత్మాహుతి దళానికి చెందిన ఉగ్రవాది పేల్చి వేశాడు. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనలో 12 మంది ఆర్మీ జవాన్లు దుర్మరణం చెందగా, సుమారు 38 మంది ప్రజలు గాయపడ్డారు. మోటార్ సైకిల్ పై వచ్చిన ఆత్మాహుతి దళానికి చెందిన ఉగ్రవాది ఈ బస్సును ఢీ కొట్టడంతో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ఈ సంఘటనకు బాధ్యులమని ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News